Skip to main content

Posts

Showing posts from September, 2020

అంకితభావం అంటే ఇది.. 86 కిలోల నుంచి 62 కిలోలకు తగ్గిన నటి విద్యుల్లేఖ రామన్ శ్రమ, కన్నీరు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

అంకితభావం అంటే ఏంటి? శ్రమ, పట్టుదల, కష్టపడేతత్వం అంటే ఏంటి? విజయానికి వాటికి ఏంటి సంబంధం.. అంటే ఖచ్చితంగా వాటి మధ్య సంబంధం ఉంది అనే చెప్పుకోవాలి. నీలో కష్టపడేతత్వం, పట్టుదల, అంకితభావం ఉంటేనే విజయం నీకు బానిస అవుతుంది. లేదంటే ఓటమి నిన్ను వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది. ఓటమి ఎప్పుడూ నీదగ్గరే ఉంటుంది. అది ఏ పని అయినా.. చివరకు బరువు తగ్గాలన్నా కూడా పట్టుదలతో శ్రమిస్తే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని నిరూపించింది నటి విద్యుల్లేఖ రామన్. ఆమె సినిమాల్లో ఎలా కనిపించేదో అందరం చూశాం. చాలా లావుగా ఉండేది. అలా లావుగా ఉండటం వల్ల తను ఎన్నో చేదు అనుభవాలను చవి చూసింది. తన బరువే తనకు సమస్యగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న బరువుతో ఎన్నో సమస్యలను అనుభవించింది. ఇంతలోనే కరోనా రావడం.. లాక్ డౌన్ విధించడంతో షూటింగులన్నీ ఆగిపోయాయి. అప్పుడు తనకు చాలా సమయం దొరికింది. దీంతో వెంటనే తను డిసైడ్ అయిపోయింది. ఈ లాక్ డౌన్ సమయాన్ని మంచిగా ఉపయోగించుకొని కష్టపడి వ్యాయామం చేసి 20 కిలోలు తగ్గింది. అది పట్టుదల అంటే.. అది శ్రమ అంటే. ఈ సుదూర ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. ఎన్నో కష్టాలు. వాటన్నింటినీ దిగమింగుకొని.. వ్యాయామం మ