Skip to main content

Posts

Showing posts from August, 2020

ఇంటి పైన సహజ పద్ధతిలో ఆర్గానిక్ స్ట్రాబెర్రీ , గ్రేప్స్ పండిస్తున్న పూణే మహిళ.. ఆమె సలహాలు మీరూ తీసుకోండి

ఈరోజుల్లో అంతా కల్తీ. ఏం తిందామన్నా కల్తీ. చివరకు కూరగాయలు, పండ్లు కూడా కల్తీ అయిపోయాయి. ఎన్నో రకాల కెమికల్స్ కలిపి ఇప్పుడు కూరగాయలు, పండ్లను పండిస్తున్నారు. అవి తింటే ఓ బాధ.. తినకపోతే ఇంకో బాధ. ఏం చేస్తాం.. కలికాలం అంటూ చూస్తూ కూర్చోవడం కంటే.. మనమే సహజమైన పండ్లను పండించుకుంటే పోలా.. అదిరిపోలా.. అని అనుకున్నది ఓ మహిళ. అనుకున్నదే తడువుగా వెంటనే తన ఇంటి మిద్దె పైన అన్నిరకాల పండ్లను సహజమైన పద్ధతుల్లో పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. ఆమె పేరు సుజాత నాఫడె. వయసు 45. ఊరు మహారాష్ట్రలోని పూణె. ఆమె ఇప్పుడు కాదు.. 2008 నుంచే తన ఇంటి మిద్దె పైన రకరకాల పండ్ల చెట్లను పెంచడం ప్రారంభించారు. 70 రకాల పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారావిడ. నిజానికి సుజాత వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయాన్ని చూస్తూ పెరిగారు. అందుకే తనకు కూడా వ్యవసాయం మీద ఉన్న మక్కువతో పెళ్లయ్యాక కూడా తన ఇంటి మిద్దె పైన రకరకాల పండ్లను పండిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఏడేళ్ల క్రితం తన ఫ్రెండ్ ఒకరు కేరళ నుంచి తీసుకొచ్చి ఒక గ్రేప్ మొక్కను గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక.. ఆ చెట్టును పెట్టినప్పటి న

విమానం తయారు చేయడానికి అమ్మ పుస్తెలతాడును తాకట్టు పెట్టాడు.. మొదటిసారి ఇండియాలో విమానాన్ని తయారుచేసి రికార్డు సృష్టించాడు.. సక్సెస్ స్టోరీ

పైనుంచి విమానం వెళ్తుంటే మనం ఏం చేస్తాం.. అబ్బ.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలి అని అనుకుంటాం. ఇంకొందరు ఆ విమానాన్ని ఒక్కసారైనా నడపాలి అని అనుకుంటారు. కానీ.. మహారాష్ట్రకు చెందిన అమోల్ యాదవ్ మాత్రం జీవితంలో ఒక్కసారైనా విమానాన్ని తయారు చేయాలి అని అనుకున్నాడు. అనుకోవడమే కాదు.. దాని మీద ఎంతో శ్రమించాడు.. చివరకు సక్సెస్ అయ్యాడు. తొలిసారిగా ఇండియాలో విమానాన్ని తయారుచేసి రికార్డు సృష్టించాడు. అమోల్ యాదవ్ ది ముంబై. అమోల్ జెట్ ఎయిర్ వేస్ విమానాలకు పైలెట్ గా పనిచేశాడు. 19 ఏళ్లకే కమర్షియల్ పైలెట్ ట్రెయినింగ్ కోసం యూఎస్ వెళ్లాడు. పైలెట్ శిక్షణ కూడా పూర్తి చేసుకున్న అమోల్ కు సొంతంగా ఎందుకు విమానం తయారు చేయకూడదు.. అనే ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే కాదు.. దాన్ని ఎలాగైనా చేసి చూపించాలనుకున్నాడు. తర్వాత ఇండియాకు వచ్చాడు. వెంటనే తన ఆలోచనను తన ఫ్యామిలీతో పంచుకున్నాడు. వెంటనే తన పని ప్రారంభించాడు. తన ఇంటి స్లాబ్ పైన్నే ల్యాబ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే విమానాలు తయారు చేయడం ప్రారంభించాడు. ఓసారి విమానం తయారు చేయడానికి డబ్బులు తక్కువైతే తన అమ్మ మంగళసూత్రం అమ్మి విమానం ఇంజన్ కొన్నాడు. ఇలా.. ఆర్థిక

వలస కార్మికుడి కూతురు.. యూనివర్సిటీ టాపర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..!

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు... తరతరాలకు చెరగని వెలుగవుతారు.. అని ఓ కవి ఊరికనే అనలేదు. మన బ్యాక్ గ్రౌండ్ ఏదైనా కానీ.. మనం ఎక్కడి నుంచైనా రానీ.. తినడానికి తిండి లేకున్నా.. కట్టుకోవడానికి బట్టలు లేకున్నా.. అందరూ ఛీ.. అన్నా థూ.. అన్నా.. తిట్టినా.. కొట్టినా.. చివరకు ఎవ్వరూ పట్టించుకోకున్నా.. నీలో ఎదగాలి అనే కసి ఉంటే చాలు.. చదవాలి అనే కసి ఉంటే చాలు. నిన్ను ఇక ఆ దేవుడు దిగి వచ్చినా ఆపలేరు.. అనేది నిష్టూరమైన సత్యం.. అని తెలియజెప్పింది ఈ అమ్మాయి. ఆమె తండ్రి వలస కార్మికుడు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లాలి. ఆ ఊరు ఈ ఊరు అని కాకుండా అన్ని ఊర్లు తిరగాలి. రాష్ట్రాలు దాటాలి. కానీ.. తన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆ తండ్రి ఆరాటపడ్డాడు. పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్లాడు. తన కూతురును కష్టపడి చదివించాడు. దీంతో తన కూతురు బాగా చదువుతుందిలే అని అనుకున్నాడు కానీ.. తన కూతురు ఏకంగా యూనివర్సిటీ టాపర్ అవుతుందని ఏనాడూ ఊహించలేదు. కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీఏ ఆర్కియాలజీ బ్రాంచ్ లో 85 శాతం మార్కులు సాధించి ఆ అమ్మాయి యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది. దీంతో ఆ తండ్రి ఆనందానికి

వాళ్లంతా ట్రాన్స్ జెండర్స్.. కానీ ఒకరి దగ్గర చేయి చాపలేదు.. కరోనా టైమ్ లోనూ సొంతంగా పచ్చడి బిజినెస్ పెట్టి సక్సెస్ సాధించారు

ట్రాన్స్ జెండర్ లేదా నపుంసకులు లేదా హిజ్రాలు... అంటేనే ఈ సమాజంలో చిన్నచూపు. వాళ్లు ఎవరైనా డబ్బులు అడుక్కోవడానికి వస్తే.. ఛీ..ఛీ.. అని అంటాం. ఓ 10 రూపాయలు ఇవ్వడానికి సందేహిస్తాం. ఏదైనా పనిచేసుకొని చావొచ్చుగా.. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని గులుగుతాం. నిజానికి.. వాళ్లు డబ్బులు అడుక్కోవడానికి ఓ కారణం ఉంది. వాళ్లకు ఎవరూ పని ఇవ్వరు. అందుకే వాళ్లు అడుక్కొని తమ జీవనం సాగిస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న తంతే. కాకపోతే ఈమధ్య కరోనా వచ్చి అందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయి కదా. అందరిలాగే వాళ్ల జీవితాలు కూడా కుదేలయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. బయటికి వెళ్లే అవకాశం లేదు. తిండికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఏం చేయాలి.. డబ్బులు అడుక్కుందామన్నా బయట నరమానవుడు కనిపించడం లేదు. కనిపించినా.. కరోనా భయం ఒకటి.. కరోనా వల్ల పనుల్లేక అందరూ ఉంటే.... వాళ్లకు డబ్బులు ఎవరు ఇస్తారు.. దీంతో ఒక పూట తిండికి కూడా నోచుకోని హిజ్రాలు ఎందరో సరే.. ఇప్పుడు మనం అసలు టాపిక్ కు వచ్చేద్దాం.. కరోనా సమయంలో తిండి లేక చద్దామా? లేక ఏదైనా పని కల్పించుకొని నాలుగు రాళ్లు వెనకేసుకుందామా? అని గట్టిగా నిర్ణయించుకున్నారు హైద

45 ఏళ్లుగా ఖరీదైన వైద్యానికి కూడా 5 రూపాయలే తీసుకుంటున్న డాక్టర్ గురించి మీకు తెలుసా?

  వైద్యం అంటేనే వ్యాపారం అయింది ఈరోజుల్లో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నా వైద్యం చేయరు. డాక్టర్లు సరిగ్గా ఉండరు. కొన్ని చోట్ల అసలు సౌకర్యాలే ఉండవు. ఇంకొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్బులు ముట్టచెప్పనిదే వైద్యం అందదు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిందే. కట్టుబట్టలతో బయటికి పంపిస్తాయి కార్పొరేట్ ఆసుపత్రులు. రోజూ ఎన్ని చూస్తున్నాం మనం. కానీ.. అందరూ అలాగే ఉంటారా? అందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారా? అంటే కాదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఓ డాక్టర్... కేవలం 5 రూపాయలకే ఖరీదైన వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. అది 45 ఏళ్ల నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరివద్దా ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోకుండా వైద్యాన్ని అందిస్తున్న ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సిందే మనం. ఆయన పేరే వి. తిరువేంగడం. వయసు 70. ఊరు చెన్నై. అక్కడ 5 రూపాయల డాక్టర్ అని ఎవరిని అడిగినా కళ్లు మూసుకొని చెబుతారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అలా ఉంటది అక్కడ. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. తమిళ్ హీరో విజయ్ నటించిన అదిరింది సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమాలో విజయ్ ఓ డాక్టర్. 5 రూపా

30 ఏండ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు.. చిన్న ఆరోగ్య సమస్య కూడా లేదు

  ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 30 ఏండ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు ఆ వ్యక్తి. వర్షపు నీటినే తాగుతున్నా అతడికి ఇప్పటి వరకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాలేదు. షాకింగ్ గా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. పదండి ఇంకాస్త ముందుకెళ్దాం. ఆయన పేరు పొన్నాడ వసంత్ కుమార్. వయసు 60 కి పైనే. అంటే 63 ఏళ్లు. తెలంగాణలోని సంగారెడ్డి ఆయన ఊరు. సంగారెడ్డిలోనే బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్కడే సెటిల్ కూడా అయ్యాడు. అయితే... వసంత్ కుమార్ 30 ఏళ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు. ఆయనొక్కడే తన ఫ్యామిలీ మొత్తం వర్షపు నీటినే తాగుతారట. 30 ఏళ్ల నుంచి వర్షపు నీరు తాగుతున్నా కూడా తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నాడు వసంత్ కుమార్. అయితే.. వర్షపు నీటిని వీళ్లు ఎలా తాగుతారంటే.. ముందు వర్షం పడే సమయంలో నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు. వర్షాకాలంలో పడ్డ వర్షాన్ని వృథా కానీయకుండా పట్టుకొని నిల్వ చేసుకుంటారు. వర్షపు నీటిని పైపుల ద్వారా డాబా మీద ఉన్న డ్రమ్ముల్లో నింపుతారు. ఆ డ్రమ్ముల నుంచి ఇంట్లో ఉన్న నల్లా ద్వారా నీటిని పట్టుకొని తాగుతారు. అయితే.. డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేస