Skip to main content

30 ఏండ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు.. చిన్న ఆరోగ్య సమస్య కూడా లేదు

 

ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 30 ఏండ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు ఆ వ్యక్తి. వర్షపు నీటినే తాగుతున్నా అతడికి ఇప్పటి వరకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాలేదు. షాకింగ్ గా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. పదండి ఇంకాస్త ముందుకెళ్దాం.

ఆయన పేరు పొన్నాడ వసంత్ కుమార్. వయసు 60 కి పైనే. అంటే 63 ఏళ్లు. తెలంగాణలోని సంగారెడ్డి ఆయన ఊరు. సంగారెడ్డిలోనే బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్కడే సెటిల్ కూడా అయ్యాడు. అయితే... వసంత్ కుమార్ 30 ఏళ్ల నుంచి వర్షపు నీటినే తాగుతున్నాడు. ఆయనొక్కడే తన ఫ్యామిలీ మొత్తం వర్షపు నీటినే తాగుతారట. 30 ఏళ్ల నుంచి వర్షపు నీరు తాగుతున్నా కూడా తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నాడు వసంత్ కుమార్.

అయితే.. వర్షపు నీటిని వీళ్లు ఎలా తాగుతారంటే.. ముందు వర్షం పడే సమయంలో నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు. వర్షాకాలంలో పడ్డ వర్షాన్ని వృథా కానీయకుండా పట్టుకొని నిల్వ చేసుకుంటారు. వర్షపు నీటిని పైపుల ద్వారా డాబా మీద ఉన్న డ్రమ్ముల్లో నింపుతారు. ఆ డ్రమ్ముల నుంచి ఇంట్లో ఉన్న నల్లా ద్వారా నీటిని పట్టుకొని తాగుతారు.

అయితే.. డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసే సమయంలో అందులో ఒక టీ స్పూన్ స్ఫటికాన్ని వేసి డ్రమ్ము మూత పెడతారు. ఆ తర్వాత ఆ నీటిని నల్లా ద్వారా పట్టుకొని రాగి బిందెల్లో పోసుకొని తాగుతారు.

ఒకవేళ వర్షపు నీరు అయిపోతే మున్సిపల్ నీరు లేదా బోరు నీటిని శుద్ధి చేసుకొని తాగుతారట వసంత్. వాన నీటిలో రోగ నిరోధక శక్తి ఎక్కువుంటుందని.. వెనుకట ఆయన నాన్న కూడా అవే నీళ్లు తాగేవారని.. అందుకే ఇప్పుడు తను కూడా అవే నీటిని తాగి ఆరోగ్యం ఉన్నామని చెప్పారు వసంత్.

ఏది ఏమైనా మినరల్ వాటర్ పేరుతో మినరల్స్ అన్ని తీసేసి ఉత్త నీళ్లను అమ్మి ప్రజలకు లేనిపోని రోగాలు సృష్టిస్తున్న ఈరోజుల్లో వృథాగా పోతున్న వాననీటిని ఒడిసి పట్టుకొని తాగి పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్న వసంత్ కుమార్ ను మనం అభినందించాల్సిందే.

Comments

Popular posts from this blog

వాళ్లంతా ట్రాన్స్ జెండర్స్.. కానీ ఒకరి దగ్గర చేయి చాపలేదు.. కరోనా టైమ్ లోనూ సొంతంగా పచ్చడి బిజినెస్ పెట్టి సక్సెస్ సాధించారు

ట్రాన్స్ జెండర్ లేదా నపుంసకులు లేదా హిజ్రాలు... అంటేనే ఈ సమాజంలో చిన్నచూపు. వాళ్లు ఎవరైనా డబ్బులు అడుక్కోవడానికి వస్తే.. ఛీ..ఛీ.. అని అంటాం. ఓ 10 రూపాయలు ఇవ్వడానికి సందేహిస్తాం. ఏదైనా పనిచేసుకొని చావొచ్చుగా.. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని గులుగుతాం. నిజానికి.. వాళ్లు డబ్బులు అడుక్కోవడానికి ఓ కారణం ఉంది. వాళ్లకు ఎవరూ పని ఇవ్వరు. అందుకే వాళ్లు అడుక్కొని తమ జీవనం సాగిస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న తంతే. కాకపోతే ఈమధ్య కరోనా వచ్చి అందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయి కదా. అందరిలాగే వాళ్ల జీవితాలు కూడా కుదేలయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. బయటికి వెళ్లే అవకాశం లేదు. తిండికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఏం చేయాలి.. డబ్బులు అడుక్కుందామన్నా బయట నరమానవుడు కనిపించడం లేదు. కనిపించినా.. కరోనా భయం ఒకటి.. కరోనా వల్ల పనుల్లేక అందరూ ఉంటే.... వాళ్లకు డబ్బులు ఎవరు ఇస్తారు.. దీంతో ఒక పూట తిండికి కూడా నోచుకోని హిజ్రాలు ఎందరో సరే.. ఇప్పుడు మనం అసలు టాపిక్ కు వచ్చేద్దాం.. కరోనా సమయంలో తిండి లేక చద్దామా? లేక ఏదైనా పని కల్పించుకొని నాలుగు రాళ్లు వెనకేసుకుందామా? అని గట్టిగా నిర్ణయించుకున్నారు హైద

45 ఏళ్లుగా ఖరీదైన వైద్యానికి కూడా 5 రూపాయలే తీసుకుంటున్న డాక్టర్ గురించి మీకు తెలుసా?

  వైద్యం అంటేనే వ్యాపారం అయింది ఈరోజుల్లో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నా వైద్యం చేయరు. డాక్టర్లు సరిగ్గా ఉండరు. కొన్ని చోట్ల అసలు సౌకర్యాలే ఉండవు. ఇంకొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్బులు ముట్టచెప్పనిదే వైద్యం అందదు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిందే. కట్టుబట్టలతో బయటికి పంపిస్తాయి కార్పొరేట్ ఆసుపత్రులు. రోజూ ఎన్ని చూస్తున్నాం మనం. కానీ.. అందరూ అలాగే ఉంటారా? అందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారా? అంటే కాదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఓ డాక్టర్... కేవలం 5 రూపాయలకే ఖరీదైన వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. అది 45 ఏళ్ల నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరివద్దా ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోకుండా వైద్యాన్ని అందిస్తున్న ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సిందే మనం. ఆయన పేరే వి. తిరువేంగడం. వయసు 70. ఊరు చెన్నై. అక్కడ 5 రూపాయల డాక్టర్ అని ఎవరిని అడిగినా కళ్లు మూసుకొని చెబుతారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అలా ఉంటది అక్కడ. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. తమిళ్ హీరో విజయ్ నటించిన అదిరింది సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమాలో విజయ్ ఓ డాక్టర్. 5 రూపా